పోస్ట్‌లు

జూన్, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

1. ఇల్లలకగానే పండగౌనా

    ఇల్లాలు కాకపూర్వం ఓ యువతి. చదువూ, సంధ్య తెలివీ, చాకచక్యం , సమయస్ఫూర్తీ , హాస్యం , లాస్యం అన్నీ కలిగిన అమ్మాయి.   అమ్మాయి అందం తెలివీ , వాళ్ల నాన్న ఇచ్చిన కట్నం బాగా నచ్చిన ఓ చిన్నవాడు ఆ అమ్మాయి మెడలో మూడు ముళ్ళూ వేసి , ఓ ఇంటికి ఇల్లాల్ని చేసి , ' ఇదిగో అమ్మడూ ఈ ఇల్లు నీది ' అని చెప్పేడు. ఆ ఇల్లాలు వెంటనే పయిట నడుముకి బిగించి , ఇంటిని అందంగా అలికి ముగ్గులు పెట్టింది. ఆ చిన్నవాడు వెంటనే ఆ ఇల్లాల్ని మెచ్చుకుని , " నువ్వు ఇల్లు అలకడంలో నేర్పరివి ముగ్గులు వెయ్యడంలో అంతకన్నా నేర్పరివి సెభాష్ కీప్ ఇట్ అప్" అని ఇంగ్లీషులో మెచ్చుకుని భుజం తట్టాడు. దాంతో ఆ ఇల్లాలు తెగ మురిసిపోయి , ఇల్లలకడమే ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగించింది. ఎల్లప్పుడూ ఇంటిని పరిశుభ్రంగా అలికి రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దింది. ఆ విధంగా ఆమె జీవితం మూడు అలుకుగుడ్డలూ ఆరు ముగ్గుబుట్టలుగా - సాగిపోతూ వచ్చింది. కానీ ఒకనాడా ఇల్లాలు ఇల్లలుకుతూ అలుకుతూ “నా పేరేమిటి చెప్మా!" అనుకుంది. అలా అనుకుని ఉలిక్కిపడింది. చేతిలో అలుకు గుడ్డా , ముగ్గు బుట్టా అక్కడ పడేసి కిటికీ దగ్గర నిలబడి తల గోక్కుంటూ ,