పోస్ట్‌లు

జులై, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

6. తాయిలం

    విరిబోణి వీణ మీద చాలా బావుంటుంది. ఇన్ని కృతులు నేర్చుకున్నా ' విరిబోణి ' వర్ణం అంటే శారదకి చాలా ఇష్టం. ఎందుకు ఇష్టమో ఆమెకీ తెలీదుగానీ అదంటే చాలా ఇష్టం. ఆ రోజు ఇల్లు దులుపుకుంటూ వీణ శుభ్రంగా తుడుస్తుంటే ఒకసారి ' విరిబోణి ' వాయించుకోవాలనిపించింది. వీణ మాస్టారు గుర్తొచ్చారు. "సాధన చేస్తే నువ్వు ధనమ్మాళ్ అంతవుతావమ్మా!" అనేవారు. సాధన చెయ్యడానికి టైం ఎక్కడ. తీగెలు సరిగ్గా బిగించి , శృతిచేసి వర్ణం మొదలెడుతుండగా కాలింగ్ బెల్ మ్రోగింది. వీణ ప్రక్కన పెట్టి తలుపు తీసింది శారద. " ఇదేమిటి ఇల్లు ఇలా వుంది! నేను నాలుగింటికల్లా వస్తానని చెప్పలేదూ. అయిదింటికి నా కొలీగ్ శివరావుని పిలిచేను. అతని భార్యతో సహా వస్తాడు. ఈ వీణ బయటికెందుకు తీశావిప్పుడు. మైగాడ్ వాళ్ళకేవైనా తినడానికి చేశావా   లేదా" అన్నాడు. శారద వీణ పెట్టెలో పెట్టింది. విరిబోణి వర్ణం ఆమె మనసులో మెదులుతుంది. శివరావు , అతని భార్యకు   స్వాగతం పలకాలి. ఈలోగా ఇల్లు సర్దాలి. ఇల్లు నీట్ గా వుండకపోతే రావ్ గారికి కోపం వస్తుంది. ఫారిన్ కంపెనీలో పనిచేసే వారంతా ఒకరకంగా ఉండాలట. వాళ్ళ కల్చరే వేరట. వీణ పెట్టె

5. గాంధారి రాగం

చిత్రం
    అతను తనపట్ల ఎంతో ప్రేమతో కొని యిచ్చిన ‘ ఆధునిక గృహ ’ పరికరాలన్నీ శుభ్రంగా తుడిచి , వాటి వాటి స్థానాల్లో అందంగా ఠీవిగా కనపడేలా వుంచి , చీమలతో , దోమలతో , బల్లులతో , బొద్దింకలతో హోరాహోరీ పోరాడి జయించి , మచ్చలేని మహా సామ్రాజ్యానికి మకుటంలేని మహారాణిలా వెలిగిపోయే సరస్వతి , ఒకింత ప్రకృతి సిద్ధమైన చల్లనిగాలి కోసం వీధి వరండాలోకి వచ్చింది. పల్చబడుతున్నా పచ్చ పచ్చగా వున్న ఎండ అప్పుడే నీళ్ళుపోసిన మొక్కలకు మెరుగుపెడుతున్నది. సాయంత్రపు గాలి , ప్రాణాన్ని సేదదీర్చేలా వుంది. గేటుకి వరండాకీ మధ్య గచ్చు చేసిన నడవలో స్నేహితురాలు రషీదాతో షెటిల్ ఆడుతోంది సరస్వతి కూతురు గీత. రషీదా ఆరిందాలా ఆడుతుంటే గీత బ్యాట్ పట్టుకోడం రాక తికమకపడిపోతోంది. రషీదా గేలి చేస్తోంది. గీత ఉడుక్కుంటోంది. సరస్వతి మొహంలోకి వెచ్చని ఆవిర్లు వచ్చాయి. ఆవేశంగా రెండడుగులు నడవ వైపు వేసి ఉలిక్కిపడి మళ్ళీ వెనక్కి తిరిగింది . బాబీ వచ్చే వేళైంది , వాడు బాగా ఆకలిమీద వస్తాడు. వాడికి ముందే చేసి వుంచిన చల్లారిపోయిన టిఫిన్లు నచ్చవు. వాడు వచ్చి టేబుల్ ముందు కూర్చోగానే పల్చటి దోసెలు వేడి వేడిగా వేసి పెట్టాలి. గీత ఆట కాగానే దానికి పెట్