పోస్ట్‌లు

ఆగస్టు, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

10. దేవుడు

    మా ఆయన సద్గుణ సంపన్నుడనీ , నన్ను భార్యలా కాక స్నేహితురాల్లా చూసుకుంటాడని నాకు అన్ని విధాలా సహకరిస్తాడనీ , నిజంగా అతను నా పాలిట దేవుడేననీ మా కొలీగ్స్ చాలామందే కాకుండా మా చుట్టాలు కూడా అంటూ వుంటారు. వాళ్ళలా అన్నప్పుడు నిజంగానే నాకు కాస్త గర్వంగా వుంటుంది. ఎందుకంటే నిజంగానే కృష్ణమూర్తి మంచివాడు. చాలామందిలా తనకి తాగుడు లేదు. సిగరెట్లు కాల్చడు. ఆఫీసునుంచి వస్తూ కూరలూ సరుకులవీ తెస్తాడు. పాపతో హెూంవర్క్ చేయిస్తాడు. నేను వంట చెయ్యడానికి బద్దకించిన రోజున ఆవకాయ , పెరుగుతో సరిపుచ్చుకుంటాడు. నన్ను ' ఏమే! వ్రాసే ' అనడు. నేనతన్ని పేరుపెట్టి పిలిచినా వూరుకుంటాడు. అతని ఆలోచనలు , అతని పథకాలు వాకు అమితంగా నచ్చుతాయి. ఆఖరికి నేను ఉద్యోగం ఎలా చేయాలో కూడా అతనే చెబుతాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో , ఎలా ప్రవర్తించాలో అతనే నాకు నేర్పాడు. అతను అవన్నీ నేర్పకపోతే అమాయకంగా ఏ ప్రమాదం కొనితెచ్చుకుంటానోనని అతని బెంగ. “నువ్వొట్టి అమాయకురాలివి”అని అతను అంటూ వుంటే , నిజంగా నా భారం    అతని మీద వేసి నేను సుఖంగా , ఆలోచించనవసరం లేకుండా బతకగలుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. నిజానికి నాకు ఆలోచించే అవసరం

9. ఒక రాణీ - ఒక రాజా

చిత్రం
  అమెరికాలో ఉంటున్న అరుణతో ఛాటింగ్ చేస్తూ విరగబడి నవ్వుతోంది వసంత. పక్కన మ్యూజిక్ సిస్టంలో నుంచి వచ్చే పాట భూమిని అదరగొడుతోంది. "అరగంటనించీ పిలుస్తున్నా... వినపడటంలా?" అని అరుస్తూ వచ్చి మ్యూజిక్ ఆపేసి, "పద... దోసెలు తిందువుగాని. అప్పుడే పదయింది, ఇంకెప్పుడు? ఆదివారమయితే అన్ని పన్లూ ఆపడమేనా?” అని కూతుర్ని కసిరింది వసుంధర. “జస్ట్ హాఫెనవర్ మమ్మీ” అంది వసంత. "హాఫూ లేదు, అవరూ లేదు పదపద - అందరిదీ అయిపోయింది. నీకు పోసేసి ఆవిడ వంట మొదలెట్టుకుంటుంది. ఇవ్వాళ మీ నాన్నకి పెరుగు వడల మీద మనసైంది. నీకేం కావాలో మరి లంచ్లోకి - త్వరగా చెప్పేస్తే ఓ పనైపోతుంది.” "ఏదో ఒకటి చేయించు మమ్మీ" అంటూ వచ్చి టేబిల్ ముందు కూర్చుంది వసంత. వంటావిడ వసంత ముందు ప్లేటూ, పచ్చడి, పొగలు కక్కే సాంబారు పెట్టి, దోసె పోసుకురావటానికి వంటింట్లోకి పరిగెత్తింది. అయిదు నిమిషాల్లో అట్లకాడ మీదే దోసె పట్టుకొచ్చి "తినమ్మా, అదయినాక ఇంకొకటి వేస్తా" అని మళ్ళీ స్టౌ దగ్గర నిలబడింది. వసుంధర వచ్చి కూతురు ఎదురుగా కూర్చుని, "నీకు గురువారం పెళ్ళిచూపులు ఫిక్స్ చేశాం. బుధవారం సాయంత్రం ఆరుగంటలకి 'ఊర్వశి&

8. గోవు

చిత్రం
      నీరసంగా కళ్లు విప్పి చుట్టూచూసిన గోమతికి తను హాస్పిటల్లో ఉన్నట్లు అర్ధం అయిందేకాని , తను అక్కడికి ఎప్పుడు ఎందుకు ఎలా వచ్చిందో అర్థం కాలేదు. ఈ హాస్పిటల్ తమకి దగ్గర బంధువైన డాక్టర్ తారది. సరిగ్గా రెండురోజుల క్రితం చెకప్ కి రావడం , ఆవిడ చెప్పిన వార్త విని సంతోషించి , చెప్పిన మందులు కొనుక్కుని వెళ్ళడం గోమతికి తెలుసు - ఇలా మంచంమీద పడుకో వలసి రావడం ఎందుకు సంభవించిందో మాత్రం తెలీడంలేదు. మంచంమీద కూర్చుని చుట్టూ చూసింది గోమతి. ఎదురు మంచం మీద ఓ పూచిక పుల్ల పడుకొని వుంది. ఆ పూచికకి పొత్తికడుపు మీద ఇంత దూది వేసి కుట్టినట్లు కడుపు వుంది-- ఆ కడుపు చేత్తో పట్టుకుని మూలుగుతూ ఏడుస్తోంది పూచిక. పూచిక దగ్గర కూడా ఎవరూ లేరు. అవును , తన దగ్గర కూడా ఎవరూ లేరు. వృద్ధ మహారాణి గానీ ,   ప్లీడరు సుందర రావుగారు కానీ ఎవరూ లేరు. తనని ఒంటరిగా ఇక్కడెందుకు వదిలివేశారో మరి. పూచికని చూస్తే జాలేసింది గోమతికి. " పురిటి నొప్పులా" అనడిగింది. పూచిక తలాడించింది. “ దగ్గరెవరూ లేరేం” అంది గోమతి. “ అమ్మని ఇందాకే ఇంటికి పంపించాను. ఇంటి దగ్గర ముగ్గురు పిల్లలు వాళ్లకి తిండి. అదీ చూడాలిగా , సాయంత్రం